Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి 20 వేలు దాటిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India registers 20551 Corona new cases
  • గత 24 గంటల్లో 20,551 కేసుల నమోదు
  • రికవర్ అయిన వారి సంఖ్య 21,595
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,364
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 20,551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 21,595 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 1,35,364 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,34,45,624 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,26,600 మంది మృతి చెందారు.

ఇక ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 5.14 శాతంగా, రికవరీ రేటు 98.50 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,05,59,47,243 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 36,95,835 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Corona Virus
India

More Telugu News